JEE Advanced 2025 Result Date: మరోవారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. ఆ మరుసటి రోజే జోసా కౌన్సెలింగ్‌!

దేశంలోని 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్‌లతోపాటు ప్రాథమిక ఆన్సర్‌ కీని తాజాగా ఐఐటీ కాన్పూర్‌ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు..

JEE Advanced 2025 Result Date: మరోవారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. ఆ మరుసటి రోజే జోసా కౌన్సెలింగ్‌!
JEE Advanced 2025 Result date

Updated on: Jun 01, 2025 | 1:22 PM

హైదరాబాద్‌, మే 26: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్‌లతోపాటు ప్రాథమిక ఆన్సర్‌ కీని తాజాగా ఐఐటీ కాన్పూర్‌ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని వీటిని డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 18న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించింది.

తాజాగా విడుదలైన ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది ఆన్సర్‌ కీని రూపొందిస్తారు. అనంతరం జూన్‌ 2వ తేదీన ఉదయం 10 గంటలకు తుది కీతోపాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. అనతంరం జూన్‌ 3 సాయంత్రం 5 గంటలు జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ 2025) పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జూన్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఐఐటీ కాన్పూర్‌ స్పష్టం చేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరోవైపు వివిధ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవారంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి మొత్తం 127 విద్యాసంస్థల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. గత ఏడాది జోసా కింద 121 విద్యాసంస్థలుండగా ఈసారి కొత్తగా మరో 6 సంస్థలు చేర్చారు. దీంతో ఆ సంఖ్య 127కి చేరింది. మొత్తంగా ఈ సారి 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 46 జీఎఫ్‌టీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.