JEE Advanced 2025 Result Date: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్‌లు వచ్చేశాయ్‌.. ఫలితాలు ఎప్పుడంటే?

దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్లను విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి రెస్పాన్స్‌ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ అధికారులు తెలిపారు.

JEE Advanced 2025 Result Date: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్‌లు వచ్చేశాయ్‌.. ఫలితాలు ఎప్పుడంటే?
JEE Advanced 2025 Result Date

Updated on: May 23, 2025 | 8:20 AM

హైదరాబాద్‌, మే 23: ఐఐటీల్లో ప్రవేశానికి మే 18న కాన్పూర్‌ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్‌లతోపాటు ఆన్సర్‌ కీ గురువారం (మే 22) విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కాన్పూర్‌ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 18న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ పరీక్షలు జరిగాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 రెస్పాన్స్‌ షీట్‌ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్లను విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి రెస్పాన్స్‌ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మే 26వ తేదీలోపు ఫైనల్ కీ విడుదల చేసే వీలుంది. ఇక జూన్‌ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 తుది కీ, ఫలితాలు ఫలితాలు వెల్లడికానున్నారు. జూన్‌ 3 నుంచి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ 2025) పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జూన్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.