JEE Advanced 2024 Fee: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు పెంపు.. కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇవే

|

Dec 04, 2023 | 9:24 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజును వరుసగా రెండో ఏడాదీ పెంచారు. ఈ మేరకు ఐఐటీ మద్రాస్‌ సోమవారం (డిసెంబర్ 4) ప్రకటన వెలువరించింది. అన్ని కేటగిరీలకు ఫీజును పెంచారు. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గత ఏడాది రూ.1450 ఉండగా దాన్ని రూ.1600లకు పెంచారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్ధులకు రూ.2,900ల నుంచి రూ.3,200లకు పెంచినట్లు ఐఐటీ మద్రాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. SAARC countries అభ్యర్ధులకు 90 డాలర్ల నుంచి 180 డాలర్లకు పెంచింది..

JEE Advanced 2024 Fee: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు పెంపు.. కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇవే
JEE Advanced 2024 Application Fee
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజును వరుసగా రెండో ఏడాదీ పెంచారు. ఈ మేరకు ఐఐటీ మద్రాస్‌ సోమవారం (డిసెంబర్ 4) ప్రకటన వెలువరించింది. అన్ని కేటగిరీలకు ఫీజును పెంచారు. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గత ఏడాది రూ.1450 ఉండగా దాన్ని రూ.1600లకు పెంచారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్ధులకు రూ.2,900ల నుంచి రూ.3,200లకు పెంచినట్లు ఐఐటీ మద్రాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. SAARC countries అభ్యర్ధులకు 90 డాలర్ల నుంచి 180 డాలర్లకు పెంచింది. SAARC దేశాలకు చెందిన వారికి 100 డాలర్ల నుంచి 200 డాలర్లకు పెంచారు.

ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కోటా కింద కేటాయిస్తారు. ఇక ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష తేదీ కూడా వెలువడింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్‌ 21, 2024 నుంచి ప్రారంభంకానుంది. కాగా జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన మొదటి 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులన్న సంగతి తెలిసిందే. అలాగే జేఈఈ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా అక్టోబర్‌ 1, 1999 తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వారు అక్టోబర్ 1, 1994 తర్వాత జన్మించి ఉండకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యేటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తున్నారు.

ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్టంగా రెండు సార్లు JEE అడ్వాన్స్‌డ్‌ను ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులుగా 2023 లేదా 2024లో చదివి ఉండాలి. మొదటిసారిగా 12వ తరగతి పరీక్షకు హాజరై ఉండాలి. 2022లో లేదా అంతకు ముందు పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే వచ్చే యేడాది మే 26న పరీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.