JEE Advanced 2023 Exam date: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 ఎగ్జాం హెడ్యూల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

|

Dec 23, 2022 | 8:28 AM

2023-24 విద్యా సంవత్సరానికి దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జూన్‌ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ఈ మేరకు..

JEE Advanced 2023 Exam date: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 ఎగ్జాం హెడ్యూల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
JEE Advanced 2023 exam date
Follow us on

2023-24 విద్యా సంవత్సరానికి దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జూన్‌ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ఈ మేరకు ఐఐటీ గువాహటి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత పొందిన టాప్‌ 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 2021 నవంబర్‌లో విడుదల చేసిన కొత్త సిలబస్‌ ప్రకారంగానే పరీక్ష ఉంటుంది. దీనిలో మొత్తం రెండు పేపర్లకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష ఫలితాలు జూన్‌ 18న విడుదలవుతాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇక ఏసారి ఇంటర్‌లో ఎస్‌సీ/ఎస్‌టీ/వికలాంగ విద్యార్ధులు 65 శాతం, ఇతర విద్యార్ధులు 75 శాతం సాధించి ఉండాలనే నిబంధనను సైతం అమలు చేయనున్నారు. కరోనా కారణంగా ఈ మార్కుల నిబంధనకు గత మూడేళ్లుగా మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్లికేషన్‌ ఫీజు కూడా ఈ సారి కొంతమేరకు పెంచారు. ఎస్‌సీ/ఎస్‌టీ/వికలాంగ కేటగిరి విద్యార్ధులకు రూ.1,400 నుంచి రూ.1,450కి పెంచారు. మిగిలిన వారికి రూ.2,800 నుంచి రూ.2,900కి పెంచారు. ఇక జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 12తో ముగుస్తాయి. ఏప్రిల్‌ 29న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతీ యేట జేఈఈ మెయిన్‌ను దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.