న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. 388 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ఇంటర్మీడియట్/బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ఐటీఐ డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ/బీపీఈడీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంగ్లిష్/హిందీలో స్టెనోగ్రఫీ ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 10, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్దులు గ్రూప్ ‘ఏ’ పోస్టులకు రూ.1500, గ్రూప్ ‘బీ’ పోస్టులకు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు గ్రూప్ ‘ఏ’ పోస్టులకు రూ.1000, గ్రూప్ ‘బీ’ పోస్టులకు రూ.600లు అప్లికేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.