Navodaya Exam Date: నవోదయ ఎంట్రన్స్‌ పరీక్ష తేదీ ఖరారు.. ఎప్పుడు నిర్వహించనున్నారు? ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

| Edited By: Subhash Goud

Jul 22, 2021 | 9:13 AM

Navodaya Exam Date: దేశ వ్యాప్తంగా ఉన్న పలు జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ నిర్ణయించారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు...

Navodaya Exam Date: నవోదయ ఎంట్రన్స్‌ పరీక్ష తేదీ ఖరారు.. ఎప్పుడు నిర్వహించనున్నారు? ఎన్ని సీట్లు ఉన్నాయంటే..
Navodaya Schools Exam
Follow us on

Navodaya Exam Date: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ నిర్ణయించారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. గతంలోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన ఈ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ ప్రవేశ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా ఏకంగా 11,182 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 47,320 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా ఏకంగా 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. నవోదయ ఎంట్రన్స్‌ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. రెండు గంటల నిడివితో సాగే ఈ పరీక్షలో విద్యార్థులకు మెంటల్‌ ఎబిలిటీ, అర్థమ్యాటిక్‌, ల్యాంగ్వేజ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 80 అబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Also Read: CBSE class 12th Results: సీబీఎస్ఈ 12తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా..రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారంటే..

విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్..

TS Inter: ఈ ఏడాది ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసిన బోర్డు.. పరీక్ష తేదీలు ప్రకటన ..సెలవులు కుదింపు