భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్.. 24 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టులకు అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని తాజాగా పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరొక అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1, 2022వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫిజక్స్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్ 23, 2022వ తేదీ నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు తప్పనిసరిగా నవంబర్ 24, 1994 నుంచి నవంబర్ 23, 2002 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 23, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.29,300ల నుంచి రూ.92,300ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.