IOCL Recruitment 2023: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 513 ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతం..

|

Feb 16, 2023 | 9:49 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా పలు సెంటర్లలో.. 513 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IOCL Recruitment 2023: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 513 ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతం..
IOCL
Follow us on

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా పలు సెంటర్లలో.. 513 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. కెమికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఫిజిక్స్‌/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్‌/ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. అనంతరం నింపిన దరఖాస్తులను నోటిఫికేషన్ లో ఇచ్చిన ఆయా  అడ్రస్‌లకు ఏప్రిల్‌ 20వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించాలి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.