Indian Navy Admit Card 2021: ఇండియన్ నేవీ 2021 సంవత్సరానికి సంబంధించి పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. పలు విభాగాల్లో 10, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ మార్చి 7తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్ విభాగంలో సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో ప్రతినెల రూ.14,600 స్టయిఫండ్ ఇస్తారు. మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనుండగా.. వీటిలో 500 సెయిలర్ (ఏఏ), 2000 ఎస్ఎస్ఆర్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
* అభ్యర్థులు ముందుగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలోకి వెళ్లాలి.
* అనంతరం క్యాండిడేట్ లాగిన్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
* వెంటనే మీ అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. అనంతరం భవిష్యత్తు అవసరాల కోసం ఆ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఫలితాలను జూలై 2 నుంచి ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..