
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా భారత నౌకాదళంలో 1365 అగ్నివీర్ ఖాళీల ((పురుషులు-1120, మహిళలు-273)) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2023 (నవంబర్ 23) బ్యాచ్ పేరున శిక్షణ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా.. కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నవంబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 31, 2005 మధ్యలో తప్పనిసరిగా జన్మించి ఉండాలి. పురుషుల ఎత్తు 157 సెం.మీ, స్త్రీల ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా జూన్ 15, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.550 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 2023, నవంబర్ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి ప్రతినెలా మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం చొప్పున చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.