Indian Navy Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అకాశాలు లభిస్తున్నాయి. పలు కంపెనీలు కూడా ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు సైతం విడుదల చేస్తున్నాయి. ఇక ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్‌న్యూస్. నేవీలో ఖాళీల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. సాధారణంగా ప్రతీ ఏటా ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (INET) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తుంటాయి. కానీ ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐనెట్ నిర్వహించట్లేదు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో మొత్తం 40 ఖాళీలు ఉండగా, వీటిని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇక దరఖాస్తుల ప్రక్రియప్రారంభం కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 30. అంటే ఈ రోజు, రేపు మాత్రమే అవకాశం ఉంది. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ 2021 సెప్టెంబర్ 21 నుంచి ఉంటుంది. 2022 జనవరిలో కోర్సు ప్రారంభం అవుతుంది.
ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే వివాహం కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లో కోర్సు 2022 జనవరిలో ప్రారంభం అవుతుంది. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో కోర్సు ఉంటుంది.
విద్యార్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కోల్‌కతా, భోపాల్‌లో ఉంటాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయాలి. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత APPLY ONLINE పైన క్లిక్ చేసి పూర్తి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.