
Indian Navy SSC Officer Recruitment 2023: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభం కానున్న షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్, లాజిస్టిక్స్, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) బ్రాంచుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2, 1999 నుంచి జనవరి 1, 2004 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆసక్తి కలిగిన వారు మే 14, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ చేసిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్, శారీరక కొలతల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.