Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ సెయిలర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..

|

Nov 01, 2021 | 8:14 AM

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులోభాగంగా మొత్తం 300 సెయిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులను..

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ సెయిలర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..
Indian Navy Recruitment 202
Follow us on

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులోభాగంగా మొత్తం 300 సెయిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (నవంబర్‌ 2) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూసేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 300 నేవీ సెయిలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి 10వ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థులు 01 ఏప్రిల్‌ 2002, 30 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 30 నిమిషాల నిడివితో జరిగే రాత పరీక్షలో ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.

* రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 జీతంగా చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఇస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (నవంబర్‌ 2, 2021) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: NPCIL Recruitment: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు.. అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక..

Southern Railway Posts: సదరన్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Southern Railway Posts: సదరన్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..