భారత్‌లో IT నియామక ల్యాండ్‌స్కేప్ కీలకమైన దశలో ఉంది. ప్రత్యేక నైపుణ్యాలపై ముఖ్యంగా AI, డేటా సైన్స్ నైపుణ్యాలు, టైర్ 2 నగరాల వైపు ఈ రంగంలో దృష్టి సారించడం ప్రారంభించింది. 2024లో ఐటీ నియామకాలు క్షీణతను సూచించినప్పటికీ.. 2025లో మాత్రం ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక పురోగతుల మెరుగుపడనున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తుంది.
గతేడాదితో పోల్చితే 2024లో భారత్ IT రంగం దాదాపు 7 శాతం క్షీణతను చవిచూసింది. స్థూల ఆర్థిక సవాళ్లు, ప్రపంచ అనిశ్చితి కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు (GCCs) నియామకాలను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. టెక్ నిపుణులకు 52.6 శాతం ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. అయినా ఐటీ సేవల రంగం తిరోగమనాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోయినట్లు అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ అభిప్రాయపడ్డారు. ఇంతటి క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో స్థితిస్థాపకత, వృద్ధిని సాధించగలిగాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లో డిమాండ్ 39 శాతం పెరిగింది. అడెకో పరిశోధన ప్రకారం, ఐటీ కంపెనీలు ఈ సాంకేతికతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. 2024 మూడో త్రైమాసికంలో 48 శాతం పెరుగుదలను చూసిన టైర్ 2 నగరాల్లో IT నియాకాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి కనిపించడమే ఇందుకు నిదర్శనం. మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి అనుభవం ఉన్న నిపుణుల నియామకాలు 35 శాతానికి పెరిగాయి. మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య కంపెనీలు అనుభవజ్ఞులైన అభ్యర్థులకు కూడా ప్రాధ్యాన్యం ఇస్తున్నాయి.
వివిధ సాంకేతిక రంగాలలో 2-15 శాతం వరకు వృద్ధి రేట్లు ఉండటంతో, తాజా గ్రాడ్యుయేట్‌ల నియామకం ఆశించిన స్థాయిలో లేవు. అనిశ్చిత డీల్ ఫ్లోల కారణంగా కంపెనీలు ఆన్‌బోర్డింగ్ క్యాంపస్ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. కానీ భారత్‌లో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. 2025 IT నియామక ల్యాండ్‌స్కేప్ గణనీయంగా పుంజుకునే సంకేతాలు కనిపిస్తు్న్నాయి. 2024లో క్యాంపస్ నియామకాలు ఆలస్యం అయిన.. 2025 ప్రారంభంలో పెద్ద ప్రాజెక్ట్‌ల డీల్ ఫ్లో తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో ఈ పరిస్థితి మారవచ్చని COO అండ్ టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ ఎంప్లాయబిలిటీ బిజినెస్ హెడ్ జైదీప్ కేవల్రమణి అన్నారు. దీంతో 2025లో కొత్త గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయని కేవల్రమణి తెలిపారు. ముఖ్యంగా AI, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో డిమాండ్ దృష్ట్యా కంపెనీలు తమ శ్రామిక శక్తిని పెంచడంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. AI, ఇతర అధునాతన సాంకేతికతలను వేగవంతం చేయడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయని విప్రో CTO సంధ్య అరుణ్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాలు కలిగిన నిపుణులకు డిమాండ్ 30-35 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.