Wipro Jobs: బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగులను తీసుకోనున్న విప్రో..

|

Nov 30, 2021 | 11:23 AM

Wipro Jobs For Freshers: కరోనా సమయంలో నెమ్మదించిన ఉద్యోగాల నియమాకం ఇప్పుడు ఊపందుకుంటోంది. పరిస్థితులు మెరుగుపడడంతో కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి...

Wipro Jobs: బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగులను తీసుకోనున్న విప్రో..
Wipro Jobs
Follow us on

Wipro Jobs For Freshers: కరోనా సమయంలో నెమ్మదించిన ఉద్యోగాల నియమాకం ఇప్పుడు ఊపందుకుంటోంది. పరిస్థితులు మెరుగుపడడంతో కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు సైతం ఉద్యోగ నియామకాల జోరు పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో వచ్చే ఏడాది భారీగా ఫ్రెషర్స్‌ను తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఏకంగా 25,000కిపైగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది.

ఇటీవల జరిగిన ఇన్వేంటర్‌ డే 2021 కార్యక్రమంలో భాగంగా విప్రో ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోవిల్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన అభ్యర్థులను సంస్థలోకి తీసుకోవడానికి విప్రో కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే పలు రకాల ప్రోగ్రామ్స్‌ కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విప్రోలో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇక గతేడాది ఈ సంస్థ 17000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇప్పటికే టీసీఎస్‌ 77వేలమందిని, ఇన్ఫోసిస్‌ 45 వేల మందిని, హెచ్‌సీఎల్‌ 22 వేల మందిని తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్న వేళ.. విప్రో కూడా ఈ పోటీలోకి దిగింది.

ఇక ఫ్రెషర్స్‌కు కొత్త రకం టెక్నాలజీపై పట్టు సాధించేందుకుగాను విప్రో పలు రకాల చర్యలు తీసుకుంటోందని, అలాగే కొత్తగా చేరిన వారికి త్వరగతిగా జీతాలు పెరిగేలా సరికొత్త ఇంక్రిమెట్‌ ప్రోగ్రామ్‌కూడా చేపట్టనున్నట్లు సౌరభ్‌ తెలిపారు. ఏది ఏమైనా కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్‌ను తీసుకోవడానికి పోటీ పడుతుండం ఆశాజనకంగా కనిపిస్తోంది.

Also Read: Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..

Megastar Chiranjeevi: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసిన చిరు… తనయ నీహారికపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త తెలిపిన టీఎస్‌ఆర్టీసీ.. వారికి ప్రయాణం ఉచితం..