Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

Jul 06, 2021 | 2:24 PM

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాలకు సంబంధించి 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Indian Coast Guard
Follow us on

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాలకు సంబంధించి 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లికేషన్లు కూడా ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన joinindiancoastguard.cdac.in లోకి వెళ్లి.. దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 2వ తేదీనే అప్లికేషన్లు స్టార్ట్ అవగా.. జులై 16 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), టెక్నికల్ విభాగాలకు సంబంధించి 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి:
కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 22 సంవత్సరాల వయసు ఉండాలి.

అర్హతలు:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): కౌన్సిల్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) చేత గుర్తించబడిన సంస్థ నుంచి గణితం, భౌతిక శాస్త్రంతో 10 + 2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) చేత గుర్తించబడిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
3. టెక్నికల్: సిబిఎస్ఇ చే గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి పాస్ అవ్వడంతో పాటు.. ఏఐసిటిఇ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లోమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వేతనం:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): బేసిక్ శాలరీ రూ. 21,700 (పే లెవల్ -3)+ డియర్నెస్ అలవెన్స్, ఇతర అలవెన్సులు ఉంటాయి.

2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): బేసిక్ పే స్కేల్ 21,700 (పే లెవల్ -3)తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

3. టెక్నికల్: బేసిక్ పే స్కేల్ రూ. 29,200 (పే లెవల్ -5) తో పాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు joinindiancoastguard.cdac.in కు లాగిన్ అవ్వాలి. ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఉపయోగించి అప్లికేషన్ చేసుకోవచ్చు.