Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్సుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఈ సంస్థల్లో.. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకోసం కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* మొత్తం 350 పోస్టులకు గాను.. నావిక్ (జనరల్ డ్యూటీ) – 260, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) – 50, యాంత్రిక్ (మెకానికల్) – 20, యాంత్రిక్ (ఎలక్ట్రికల్) – 13, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) – 07 భర్తీ చేయనున్నారు.
* నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
* నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు.. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థుల వయసు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
* యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/ పవర్) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఈ నియామకాన్ని మొత్తం 4 దశల్లో చేపట్టనున్నారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)
* దరఖాస్తుల ప్రక్రియ జులై 02 నుంచి ప్రారంభమవుతుండగా.. చివరి తేదీని 16-07-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
చైనా గూఢచారికి హైదరాబాద్‌లోనూ కంపెనీ?.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు