TGC Recruitment 2021: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారత ఆర్మీలో భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు..

|

Feb 28, 2021 | 11:03 AM

మీరు బిటెక్ చేసిన నిరుద్యోగులా లేక చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులా.. ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఉందా.. అయితే అటువంటి వారికీ ఇదే మంచి అవకాశం.. మంచి జీతంతో...

TGC Recruitment 2021: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారత ఆర్మీలో భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు..
Follow us on

Army TGC Recruitment 2021: మీరు బిటెక్ చేసిన నిరుద్యోగులా లేక చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులా.. ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఉందా.. అయితే అటువంటి వారికీ ఇదే మంచి అవకాశం.. మంచి జీతంతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు .. ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ఆర్మీల 133 టెక్నీకల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-133) రిక్యుట్మెంట్ 2021నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ పూర్తి వివరాలు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం..

బీటెక్ పూర్తి చేసుకున్న వారు లేదా.. చివరి సంవత్సరం చదువుతున్న వారి నుంచి భారత్ ఆర్మీ దరఖాస్తుల్ని కోరుతోంది. (TGC-133 లో నలభై పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పెళ్లికానీ పురుషులే అర్హులు. వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి.. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లై చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 26, పూర్తి వివరాలని https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ లో చూసి తెలుసుకోవచ్చు.

ఇక పోస్టుల వివరాలోకి వెళ్తే.. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి.

సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ 11,
ఆర్కిటెక్చర్ 1,
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 4,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 9,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ 2,
టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1,
శాటిలైట్ కమ్యూనికేషన్ 1,
ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్ 3,
ఆటో మొబైల్ ఇంజనీరింగ్ 1
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రోసెస్ చూద్దాం..!

అప్లై చేయాలనుకునే వాళ్ళు ముందుగా https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఆ తరువాత Officers Entry Login ట్యాబ్ ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేసి.. అభ్యర్థి తన వివరాలు ఎంటర్ చేయాలి. అంతేకాదు.. ఒక ఫోటో, సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.. అనంతరం అన్ని ఒక్క సారి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసి.. ఫైనల్ గా సబ్మిట్ చేయాలి.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2021 జనవరి లో శిక్షణ ఉంటుంది. డెహ్రడూన్‌ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ ఖర్చుల తో 49 వారాల శిక్షణ లభిస్తుంది. క్యాడెట్ ట్రైనింగ్ స్టైపెండ్ గా రూ.56,100 లు ఇస్తారు.