Indian Army Jobs 2026: ఇండియన్‌ ఆర్మీలో SSC టెక్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. జనవరి 6 నుంచి దరఖాస్తులు

ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్‌) ఎస్‌ఎస్‌సీ టెక్‌-67 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హత కలిగిన మహిళా, పురుష అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ ఏ క్షణమైన విడుదలయ్యే అవకాశం ఉంది..

Indian Army Jobs 2026: ఇండియన్‌ ఆర్మీలో SSC టెక్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. జనవరి 6 నుంచి దరఖాస్తులు
Indian Army SSC Tech 67th Recruitment

Updated on: Jan 04, 2026 | 3:40 PM

భారత త్రివిధ దళాల్లో 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో ప్రవేశాలకు షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ షార్ట్‌ నోటిఫికేషన్‌ వివరాల ప్రకారం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్‌) ఎస్‌ఎస్‌సీ టెక్‌-67 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన మహిళా, పురుష అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఏవియానిక్స్, మైనింగ్, కెమికల్, టెక్స్‌టైల్, బయోటెక్ వంటి తదితర ఏఐసీటీ ఆమోదించిన ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్‌) పూర్తి చేసి ఉండాలి.

అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్ 1, 2026వ తేదీ నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఫిబ్రవరి 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో కోర్సు ప్రవేశాలు జరుగుతుంది. మొత్తం 49 వారాల పాటు అక్టోబర్‌ 2026 నుంచి సెప్టెంబర్‌ 2027 వరకు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.50.100 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇండియన్‌ ఆర్మీ – 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుకు సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, పీసీటీఏ, ఇంటర్వ్యూ కేంద్రాలు వంటి తదితరాల పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేయనున్న వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 6, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2026.
  • ఎస్‌ఎస్‌సీ మహిళ అభ్యర్థులకు అప్లికేషన్‌ సమర్పప తేదీలు: జనవరి 6 నుంచి ఫిబ్రవరి 4 వరకు
  • ఎస్‌ఎస్‌సీ పురుష అభ్యర్థులకు అప్లికేషన్‌ సమర్పప తేదీలు: జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు
  • రాత పరీక్ష తేదీలు: త్వరలోనే వెల్లడి

ఇండియన్‌ ఆర్మీ – 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.