Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!

|

Jan 24, 2022 | 3:21 PM

ఇండియన్ ఆర్మీ (Indian Army )లో NT JAG and 10+2 TES-47 courses కోసం ఆసక్తి కలిగిన అవివాహిత (unmarried) పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు 6 పోస్టులు, మహిళలకు 3లను భర్తీ చేయనున్నారు.

Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!
Army Recruitment
Follow us on

Indian Army NT JAG Recruitment 2022: ఇండియన్ ఆర్మీ (Indian Army )లో NT JAG and 10+2 TES-47 courses కోసం ఆసక్తి కలిగిన అవివాహిత (unmarried) పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు 6 పోస్టులు, మహిళలకు 3లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు
పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (NT) JAG ఎంట్రీ స్కీమ్

ఖాళీల సంఖ్య: 9

స్టై పెండ్: ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,100/- ఇస్తారు. శిక్షణ అనంతరం నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతం అందిస్తారు.

అర్హతలు:
అభ్యర్థి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఏదైన కళాశాల/విశ్వవిద్యాలయంలో LLB డిగ్రీలో కనీసం 55% మార్కుల (గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల ప్రొఫెషనల్ లేదా 10+2 పరీక్ష తర్వాత ఐదు సంవత్సరాలు)తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ పొందాలి. ఈ అకాడమీలో ప్రీ-కమీషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మద్రాస్ విశ్వవిద్యాలయం ద్వారా డిఫెన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూలై 1, 2022 నాటికి 21 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి (జూలై 2, 1995 కంటే ముందు జూలై 1, 2001 తర్వాత కాదు).

ఎంపిక విధానం: అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు www .joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..