Indian Army Exam Cancel: భారత సైన్యం జూన్ 27 న షెడ్యూల్ చేసిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను రద్దు చేసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మన్ 10, 8 తరగతులు, సోల్జర్(ఎన్ఏ/వైట్), సైనిక గుమస్తాల ఎంపిక కోసం ఈ నెల 27వ తేదీన జరగాల్సిన సాధారణ ప్రవేశ పరీక్షను భారత సైన్యం రద్దు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత సైన్యాధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని, సవరణ చేసిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఈ పరీక్ష ఏప్రిల్, మే నెలల్లోనే జరగాల్సి ఉండగా.. అప్పటికి కరోనా వ్యాప్తి దేశ వ్యాప్తంగా ఉధృతంగా ఉండటంతో పరీక్ష నిర్వహణను వాయిదా వేశారు. ప్రస్తుతం కూడా పరిస్థితులు అలాగే ఉన్న నేపథ్యంలో మళ్లీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జైపూర్, జోధ్‌పూర్‌లో ఏప్రిల్ 25న జరగాల్సి ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. జైపూర్, సికార్, టోంక్ జిల్లాల అభ్యర్థుల కోసం మార్చి 8వ తేదీ నుంచి 31 వరకు నియామక ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 25న పరీక్ష పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో పరీక్షను జూన్ 27కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీని కూడా రద్దు చేశారు. ఇదొక్కటే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని భారత సైన్యాధికారులు తెలిపారు.
Also read: