India Post GDS Recruitment 2021: ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్ సర్కిల్‌కు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియాన పోస్ట్ అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అయితే అర్హత మరియు పోస్టుపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు indiapost.gov.in లోని ఇండియా పోస్ట్ యొక్క అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క ఉద్యోగ ప్రొఫైల్‌లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, ఇండియా పోస్టుల చెల్లింపుల బ్యాంక్ (ఐపిపిబి) యొక్క మేనేజింగ్ వ్యవహారాలు వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7 వరకు ఉంటుంది. ఇందులో భాగంగా 1137 పోస్టులను భర్తీ చేస్తుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 8, 2021
దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్ 7, 2021
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన గణితం, స్థానిక భాష, మరియు ఇంగ్లీష్ లో ఉత్తీర్ణత సాధించిన 10 వ తరగతి సెకండరీ స్కూల్ పరీక్షలో పాస్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. GDS పోస్టులకు కోసం కనీస, గరిష్ట వయస్సు వరుసగా 18 మరియు 40 సంవత్సరాలు ఉండాలి. అయితే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 / – దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. దరఖాస్తుదారు హోమ్ పేజీలో అందించిన URL ను ఉపయోగించి ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా రుసుమును చెల్లించవచ్చు.