TS SET: తెలంగాణ సెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. షెడ్యూల్‌లో మార్పు. మారిన తేదీలు ఇవే..

|

Mar 07, 2023 | 5:57 PM

తెలంగాణలో అసిస్టెంట్‌ ప్రొఫెర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది...

TS SET: తెలంగాణ సెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. షెడ్యూల్‌లో మార్పు. మారిన తేదీలు ఇవే..
TS SET
Follow us on

తెలంగాణలో అసిస్టెంట్‌ ప్రొఫెర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. డిసెంబర్‌ 30 నుంచి అప్లికేషన్స్‌ను స్వీకరించారు. ఇదిలా ఉంటే ఈ అర్హత పరీక్ష షెడ్యూల్‌లో మార్పుల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పరీక్షల తేదీని రీషెడ్యూల్‌ చేశారు.

మార్చి 13న జరగాల్సిన పరీక్షను 17వ తేదీన నిర్వహించనున్నారు. అయితే 14, 15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. ఈ విషయమై.. టీఎస్‌ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ సి.మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్‌ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..