Exams in January 2026: మస్త్‌ బిజీ బాస్‌.. జనవరి-ఫిబ్రవరి నెలల్లో పరీక్షలే పరీక్షలు! ఏ తేదీల్లో ఏం ఉన్నాయంటే..?

ఎక్కడ చూసినా విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. నిరుద్యోగులు ఈసారి ఎలాగైనా జాబ్‌ కొట్టాలని కసిగా చదివేస్తున్నారు. దీంతో జనవరి, ఫిబ్రవరి.. రెండు నెలలు కాస్త బిజీగా మారాయి. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్‌ పరీక్షల టైం టేబుల్స్‌ కూడా విడుదలయ్యాయి. వీటికితోడు గతేడాది ముగింపులోనే దేశవ్యాప్తంగా..

Exams in January 2026: మస్త్‌ బిజీ బాస్‌.. జనవరి-ఫిబ్రవరి నెలల్లో పరీక్షలే పరీక్షలు! ఏ తేదీల్లో ఏం ఉన్నాయంటే..?
Upcoming Exam Dates In February And February

Updated on: Jan 08, 2026 | 4:42 PM

2025-26 అకడమిక్‌ ఇయర్‌ దాదాపు ముగింపుకు వచ్చింది. దీంతో ఎక్కడ చూసినా విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. నిరుద్యోగులు ఈసారి ఎలాగైనా జాబ్‌ కొట్టాలని కసిగా చదివేస్తున్నారు. దీంతో జనవరి, ఫిబ్రవరి.. రెండు నెలలు కాస్త బిజీగా మారాయి. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్‌ పరీక్షల టైం టేబుల్స్‌ కూడా విడుదలయ్యాయి. వీటికితోడు గతేడాది ముగింపులోనే దేశవ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, అడ్మిషన్లకు వరుస నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో జరగనున్న ఉద్యోగ, ప్రవేశ పరీక్షలు ఏయే తేదీల్లో.. ఎప్పుడెప్పుడు.. జరుగుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

జనవరి-ఫిబ్రవరిలలో 2026 జరగనున్న పరీక్షలు.. వాటి తేదీలు ఇవే..

  • తెలంగాణ టెట్‌ పరీక్షలు: జనవరి 3 నుంచి 20 వరకు
  • SSC సీజీఎల్‌ టైర్‌ 2 పరీక్షలు: జనవరి 18, 19 తేదీల్లో
  • ఏఐఎస్‌ఎస్‌ఈఈ సైనిక్‌ స్కూల్‌- 2026 పరీక్ష: జనవరి 18
  • జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు: జనవరి 21 నుంచి 29 వరకు
  • ఎస్‌ఎస్‌సీ స్టెనో స్కిల్‌ టెస్ట్‌ పరీక్షలు: జనవరి 28, 29 తేదీల్లో
  • ఎస్‌ఎస్‌సీ మల్టీ టాస్కింగ్‌, హవర్దార్‌ పరీక్ష: ఫిబ్రవరి 4
  • నవోదయ 9, 11వ తరగతి  ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 7
  • గేట్‌-2026 పరీక్ష: ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు
  • ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్షలు: ఫిబ్రవరి 11, 12 తేదీల్లో
  • ఎస్‌ఎస్‌సీ 25,487 జీడీ కానిస్టేబుల్‌ పరీక్ష: ఫిబ్రవరి 23
  • ఏపీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, తానేదార్ పరీక్ష: ఫిబ్రవరి 9, 10 తేదీల్లో
  • ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3 పరీక్ష: ఫిబ్రవరి 11
  • ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పరీక్షలు: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో
  • ఏపీ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
  • ఏపీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
  • ఏపీ జూనియర్‌ లెక్చరర్‌ (లైబ్రేరియన్‌ సైన్స్‌) పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
  • ఏపీ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పరీక్షలు: జనవరి 27, 28, 29 తేదీల్లో
  • ఏపీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షలు: జనవరి 27, 28, 29, 30 తేదీల్లో
  • ఏపీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షలు: జనవరి 27
  • జూనియర్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌ 4) పరీక్షలు: జనవరి 27, 30 తేదీల్లో
  • ఏపీ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
  • ఏపీ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, వార్డెన్‌ పరీక్షలు: జనవరి 27, 29 తేదీల్లో

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.