భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. 39 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కంప్యూటర్ సెంటర్ నెట్‌వర్క్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్ షాప్ తదితర విభాగాల్లోని అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ/మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్/ఎంఎల్‌ఐఎస్/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు నవంబర్ 10, 2022వ తేదీ నాటికి 27 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు గ్రూప్ ఏ-రూ.500, గ్రూప్ బి-రూ.300, గ్రూప్ సి-రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆయా పోస్టులను బట్టి స్క్రీనింగ్ టెస్ట్/రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.