IIT Madras Recruitment 2021: చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 49 అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 1, గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎయిరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిజైన్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్/బ్రాంచ్‌లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
* దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్ అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 02-12-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పటినుంచంటే..?
ఫేక్ అకౌంట్స్‌తో హీరోయిన్‌కు కొత్త కష్టాలు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పటినుంచంటే..?