AP Assembly Session: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పటినుంచంటే..?
Andhra Pradesh Legislative Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Andhra Pradesh Legislative Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 18న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పలు అంశాల గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ప్రకారం.. 18న ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కాగా.. నాలుగైదు రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయ. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో శీతాకాల సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది.
Also Read: