IIT kharagpur Recruitment: ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

|

Jun 19, 2021 | 6:21 AM

IIT kharagpur Recruitment 2021:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) - ఖ‌ర‌గ్‌పూర్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఐఐటీకి చెందిన ఏఐ4ఐసీపీఎస్ హ‌బ్ ఫౌండేష‌న్ ప‌లు పోస్టుల‌ను....

IIT kharagpur Recruitment: ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Iit Kharagpur
Follow us on

IIT kharagpur Recruitment 2021:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) – ఖ‌ర‌గ్‌పూర్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఐఐటీకి చెందిన ఏఐ4ఐసీపీఎస్ హ‌బ్ ఫౌండేష‌న్ ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. మొత్తం 14 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) – (01), చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ (సీటీఓ) – (01), చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ (సీఓఓ) – 01, చీఫ్ ఇన్న‌వేష‌న్ ఆఫీస‌ర్ (సీఐఓ) – (01), ఇంజినీరింగ్ మేనేజ‌ర్ (02), ప్రాజెక్ట్ ఇంజినీర్ (04), లీగ‌ల్ అసోసియేట్ (01), అకౌంటెంట్ (01), టెక్నిక‌ల్ క‌మ్యూనికేష‌న్ (02) ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టును అనుస‌రించి.. డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ, ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం, ఎంకాం, ఎంబీఏ, ఎంటెక్‌/ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌తతో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా.. 10.07.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..