IIT Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Gandhinagar).. ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల (Software Developer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

IIT Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Iit Gandhinagar

Updated on: Sep 09, 2022 | 9:19 AM

IIT Gandhinagar Software Developer Recruitment 2022: గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Gandhinagar).. ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల (Software Developer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌/బీఈ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్‌ డెవలస్‌మెంట్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి 40 యేళ్లకు మించకుండా ఉండాలి.షార్ట్‌లిస్టింగ్‌, ప్రాక్టికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.35,000ల నుంచి రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.