IIT Gandhinagar Librarian Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Gandhinagar)..19 లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల (Librarian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేసన్ ఆర్చీవ్స్, మ్యానుస్ర్కిప్ట్ కీపింగ్, విభాగాల్లో పీజీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, డిప్లొమా, ఎల్ఎల్‌బీ, సీఏ, ఎంబీఏ, బీఈ/బీటెక్, కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 27 నుంచి 57 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.29,000ల నుంచి రూ.2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.