IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్ధుల సత్తా.. 22 మంది విద్యార్ధులకు ఏకంగా రూ. కోటికి పైగా ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్స్‌

|

Sep 03, 2024 | 8:08 PM

ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్‌మెంట్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 1475 మంది విద్యార్ధులు ప్లేస్‌మెంట్స్‌ దక్కించుకున్నారు. ఈ మేరకు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. 2023-24 ప్లేస్‌మెంట్స్‌ సీజన్‌లో సగటు వార్షిక వేతనం రూ. 23.5 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 22 మంది ఏకంగా రూ. కోటికి పైగా వార్షిక వేతనంతో హైప్యాకేజ్‌ జాబ్‌లను సొంతం..

IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్ధుల సత్తా.. 22 మంది విద్యార్ధులకు ఏకంగా రూ. కోటికి పైగా ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్స్‌
IIT Bombay
Follow us on

ముంబాయి, సెస్టెంబర్ 3: ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్‌మెంట్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 1475 మంది విద్యార్ధులు ప్లేస్‌మెంట్స్‌ దక్కించుకున్నారు. ఈ మేరకు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. 2023-24 ప్లేస్‌మెంట్స్‌ సీజన్‌లో సగటు వార్షిక వేతనం రూ. 23.5 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 22 మంది ఏకంగా రూ. కోటికి పైగా వార్షిక వేతనంతో హైప్యాకేజ్‌ జాబ్‌లను సొంతం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌, టెక్నాలజీ రంగాల్లో అత్యధికంగా విద్యార్ధులకు ఆఫర్లు లభించాయి. వివిధ ఇంజనీరింగ్‌ డొమైన్లలో 430 మంది విద్యార్ధులకు 106 కోర్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలు ఎంట్రీ లెవెల్‌ పొజిషన్స్‌ను ఆఫర్‌ చేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఐటీ, టెక్‌ హైరింగ్‌ ఈ ఏడాది కాస్త అధికంగా ఉంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా 307 మంది విద్యార్ధులను 84కిపైగా కంపెనీలు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లను ఆఫర్ చేశాయి. ఇంజనీరింగ్‌ రంగం ద్వారా ఐటీ రంగం రెండో అతిపెద్ద రిక్రూటర్‌గా నిలిచింది.

ఆపై ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌, ఫిన్‌టెక్‌ కంపెనీలు కూడా నియామకాల్లో పలువురు విద్యార్ధులను ఎంపిక చేసుకున్నాయి. ఈ ఏడాది 33 ఫైనాన్షియల్‌ సేవల కంపెనీలు 113 ఆఫర్లను విద్యార్ధులకు అందించాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, మొబిలిటీ, 5జీ, డేటా సైన్స్‌, ఎడ్యుకేషన్‌ ప్రొఫైల్స్‌లలో అధికంగా జాబ్‌ ఆఫర్స్‌ దక్కాయి. కూడా మెరుగైన హైరింగ్‌ ట్రెండ్స్‌ నమోదు చేశాయి. ప్లేస్‌మెంట్స్‌లో 543 కంపెనీలు ప్లేస్‌మెంట్ ప్రక్రియ కోసం నమోదు చేసుకోగా.. వాటిల్లో 388 కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి. 364 కంపెనీలు ఆఫర్లను అందించాయి. I IT బాంబేలో రిక్రూటింగ్ కంపెనీల సంఖ్య ఈ ఏడాది 12 శాతం పెరిగింది.

ప్లేస్‌మెంట్ డ్రైవ్ రెండు దశల్లో 78 అంతర్జాతీయ ఆఫర్‌లను విద్యార్థులు అంగీకరించారు. జపాన్, తైవాన్, యూరప్, UAE, సింగపూర్, USA, నెదర్లాండ్స్, హాంకాంగ్‌లోని వివిధ సంస్థల నుండి 78 అంతర్జాతీయ ఆఫర్‌లను ఐఐటీ బాంబే విద్యార్ధులు అందుకున్నారు. 2023 – 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్‌మెంట్‌లలో కోర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హై-ఎండ్ టెక్నాలజీ, టెక్నికల్ సర్వీసెస్ వంటి బహుళ రంగాల నుంచి భాగస్వామ్యం కనిపించింది. ఈ సారి IT బాంబే ప్లేస్‌మెంట్ డ్రైవ్ జూలై 2023లో ప్రారంభమవగా.. జూలై 7, 2024తో ముగిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.