IISC Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని ఈ సంస్థలో హ్యుమన్ రీసోర్సెస్ సెక్షన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగంలో పోస్టులు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్/బీఆర్క్/బీఎస్సీ/బీసీఏ/బీవీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 28, 2022 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థలను ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700+అలవెన్సులు అందిస్తారు.
* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఓబీసీ/ ఇతర అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 02-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఈ రోజు అటువైపు ఎవ్వరూ రావొద్దు. పోలీస్ శాఖ ఆదేశం..