IGNOU Admission 2022: ఇగ్నో జనవరి 2022 సెషన్‌ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే..

|

Mar 17, 2022 | 7:48 AM

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌.. యూజీ, పీజీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

IGNOU Admission 2022: ఇగ్నో జనవరి 2022 సెషన్‌ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే..
Ignou 2022
Follow us on

IGNOU admission 2022-23 last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022 సెషన్‌.. యూజీ, పీజీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐతే సెమిస్టర్, మెరిట్ ఆధారిత ప్రోగ్రాములకు ఈ పొడిగింపు వర్తించదని ఈ సందర్భంగా తెలియజేసింది. ఇగ్నో జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ గడువు మార్చి 25 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ ignouadmission.samarth.edu.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆన్‌లైన్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఇగ్నో అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు వచ్చే సంవత్సరం/సెమిస్టర్‌కు కూడా రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెల్పింది. కాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జనవరి 2022 సెషన్‌కు రిజిస్ట్రేషన్, రీ-రిజిస్ట్రేషన్ చివరి తేదీగా మార్చి 5ను నిర్ణయించారు. ఈ తేదీని మార్చి 15 వరకు పొడిగించారు. ప్రస్తుతం మరోసారి చివరితేదీని మార్చి 25 వరకు యూనివర్సిటీ పెంపొందించినట్లు ప్రకటించింది.

Also Read:

TS Eamcet Exam Date 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022 జులైలో.. కారణం ఇదే!