IDBI Recruitment 2022: రూ.89,890ల జీతంతో.. ఐడీబీఐ బ్యాంకులో 226 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

|

Jun 23, 2022 | 8:04 AM

IDBI Assistant General Manager Recruitment 2022: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం. వివరాలు: మొత్తం ఖాళీలు: 226 ఇవి కూడా చదవండి Bank of Baroda Recruitment 2022: బ్యాంక్‌ ఆఫ్‌ […]

IDBI Recruitment 2022: రూ.89,890ల జీతంతో.. ఐడీబీఐ బ్యాంకులో 226 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Idbi
Follow us on

IDBI Assistant General Manager Recruitment 2022: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీలు: 226

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • మేనేజర్ పోస్టులు (గ్రేడ్‌-బి): 82
  • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ పోస్టులు (గ్రేడ్‌- సి): 111
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టులు (గ్రేడ్‌-డి): 82

విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పేస్కేల్‌:

  • మేనేజర్ పోస్టుల (గ్రేడ్‌-బి)కు నెలకు రూ.48,170ల నుంచి రూ.69,810ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ పోస్టుల (గ్రేడ్‌- సి)కు నెలకు రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టుల(గ్రేడ్‌-డి)కు నెలకు రూ.76,010ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 25, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.

కట్‌ఆఫ్‌ విడుదల తేదీ: మే 1, 2022.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.