IDBI Bank Jobs 2021: బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల కోసం ఖాళీలను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 920 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు IDBI- idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి.
IDBI విడుదల చేసిన ఈ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు ప్రక్రియ 4 ఆగస్టు 2021న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 18 ఆగస్టు 2021గా నిర్ణయించారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 5 సెప్టెంబర్ 2021 న నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డ్ జారీ తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఇలా అప్లై చేయండి
1. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- idbibank.in కి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కరెంట్ ఓపెనింగ్‌పై క్లిక్ చేయండి
3. కాంట్రాక్ట్-2021-22లో ఎగ్జిక్యూటివ్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
4. అభ్యర్థించిన వివరాలను నింపి నమోదు చేసుకోండి
5. మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
5. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకోండి.
అర్హత, వయోపరిమితి
ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55% మార్కులు, SC, ST, వికలాంగ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఇది కాకుండా దరఖాస్తుదారుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు పొందుతారు.
అప్లికేషన్ ఫీజు
ఈ ఖాళీల కింద జనరల్, OBC, EWS వర్గాలకు దరఖాస్తు రుసుము రూ.1000 గా నిర్ణయించారు. SC, STల కోసం దరఖాస్తు రుసుము రూ.200. దీనిని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇ-చలాన్ ద్వారా చెల్లించవచ్చు.