Bank Jobs: డిగ్రీ అర్హతతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22..!

|

Aug 20, 2021 | 1:39 PM

Bank Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం అనేక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక..

Bank Jobs: డిగ్రీ అర్హతతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22..!
Follow us on

Bank Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం అనేక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొదట ఐడీబీఐ.. మణిపాల్‌ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది (9 నెలలు క్లాస్‌ రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్) వ్యవధి గల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్)లో శిక్షణ ఇస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.idbibank.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 650
► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా (డిగ్రీ) గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

► వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
► పరీక్ష విధానం: దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు కట్‌ చేస్తారు. పరీక్షలో లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60 ప్రశ్నలు; ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40; క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.

► జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (9 నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ (3 నెలలు) సమయంలో నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల నుంచి రూ.36,000 నుంచి రూ.49,910 వరకు అందుతుంది.

►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

► దరఖాస్తుకి చివరి తేదీ: ఆగస్టు 22, 2021

► పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 04, 2021

► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చీరాల, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి.
తెలంగాణ: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం.

ఇవీ కూడా చదవండి: Anganwadi Jobs: టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్

Telangana: ఓయూ పరీక్షలు వాయిదా.. శనివారం మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యా సమాచారం మీకోసం..