IDBI Recruitment 2021: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి ఏడాదిలో నెలకి రూ. 29,000, రెండో ఏడాది రూ. 31,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ. 34,000 జీతంగా అందిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పరీక్షను 05-09-2021న నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్న ఒక మార్కుగా నిర్ణయించారు.
* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజుగా రూ. 200, ఇతరులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 18-08-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..