ICT Mumbai Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో టీచింగ్‌ పోస్టులు..

|

Jul 12, 2022 | 8:24 AM

ముంబాయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ICT - Mumbai).. టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి..

ICT Mumbai Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో టీచింగ్‌ పోస్టులు..
Ict Mumbai
Follow us on

ICT Mumbai Assistant Professor Recruitment 2022: ముంబాయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ICT – Mumbai).. టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 42

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పాలిమర్‌ అండ్‌ సర్‌ఫేస్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, జనరల్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.57,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీలను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించాలి.

దరఖాస్తు రుసుము: రూ. 1000

అడ్రస్: రిజిస్ట్రార్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ), మాతుంగ, ముంబయి-400019.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 8, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: ఆగస్టు 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.