ICSI CS June Result 2021: ఐసీఎస్‌ఐ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం ఇలా చెక్‌ చేయండి..!

|

Oct 13, 2021 | 12:36 PM

ICSI CS June Result 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీఎస్ ప్రొఫెషనల్..

ICSI CS June Result 2021: ఐసీఎస్‌ఐ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం ఇలా చెక్‌ చేయండి..!
Follow us on

ICSI CS June Result 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీఎస్ ప్రొఫెషనల్, సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలను అందుబాటులో ఉంటాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ గ్రూపు, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. అయితే షెడ్యూల్‌ ప్రకారం.. ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు విడుదల కాగా, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. అలాగే ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి.

కాగా, సీఎస్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ పరీక్ష ఆగస్టు 13, 14వ తేదీల్లో నిర్వహించారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ కోసం సీఎస్‌ పరీక్ష ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు జరిగింది. అయితే ప్రొఫెషనల్‌ కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఫౌండేషన్ మరియు ఎగ్జిక్యూటివ్ విద్యార్థులు డిజిటల్ మార్క్ స్టేట్‌మెంట్‌లను మాత్రమే చూసుకుంటారని ఇనిస్టిట్యూట్ తెలిపింది. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కోసం, రిజల్ట్-కమ్-మార్క్ స్టేట్‌మెంట్‌ల హార్డ్ కాపీలు విద్యార్థుల రిజిస్టర్డ్ అడ్రస్‌లకు పంపనున్నట్లు వెల్లడించింది.

ఐసీఎస్‌ఐ ఫలితాలు చెక్‌ చేసుకోండిలా..

► ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ icsi.edu క్లిక్ చేయండి.

► వెబ్‌సైట్‌లో ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయండి.

► లాగిన్‌ అయ్యేందుకు రూల్‌ నెంబర్‌, రిజిస్ట్రేషన్ నెంబరు వరాలు నమోదు చేయండి.

► ఆ తర్వాత మీ ఫలితాలు తెరపై కనిపిస్తాయి. దానిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Capgemini Jobs: ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగ నియామకాలు.. ప్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు అవకాశం..!

Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. మరో 2226 పోస్టులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు

AMDER Recruitment: ఏఎండీఈఆర్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..