ICSE, ISC Semester 2 exam time table 2022: ICSE, ISC టర్మ్ 2 పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్‌ను కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 10, 12 తరగతి సెమిస్టర్ 2 పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీని గతంలో ప్రకటించింది. ఐతే ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి టైం టేబుల్(Time Table)ను గురువారం (మార్చి 3) విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషను అధికారిక వెబ్‌సైట్ cisce.orgలో తనిఖీ చేసుకోవచ్చు. విద్యార్ధులు పరీక్ష తేదీలను క్షుణ్ణంగా పరిశీలించి, తదనుగుణంగా ప్రిపరేషన్‌ను ప్రారంభించాలని ఈ సందర్భంగా సూచించింది. అన్ని పరీక్షలు 1 గంట 30 నిమిషాల పాటు నిర్వహించబడతాయని తెల్పింది. కాగా వివిధ పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని టైమ్‌టేబుల్‌ను రూపొందించినట్లు ఈ సందర్భంగా సీఐఎస్‌సీఈ పేర్కొంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ICSE, ISC సెమిస్టర్ 2 పరీక్షలు ఈ ఏడాది (2022) ఏప్రిల్ 25న ప్రారంభమవుతాయి.10వ తరగతి సెమిస్టర్ 2 పరీక్షలు మే 20న ముగియనుండగా.. ఇక 12వ తరగతి పరీక్షలు జూన్ 6తో ముగుస్తాయి. పదో తరగతి పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. పరీక్షను రాయడానికి టైమ్ టేబుల్‌పై సూచించిన సమయంతో పాటు, ప్రశ్నపత్రాన్ని చదవడానికి అదనంగా 10 నిమిషాలు ఇవ్వనున్నట్లు తెల్పింది. టర్మ్ 2 పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను సీఐఎస్‌సీఈ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలని విద్యార్ధులకు బోర్డు సూచించింది.
ICSE 2022 పదో తరగతి టైం టేబుల్ ఇదే..
సబ్జెక్ట్ తేదీ
ISC 12వ తరగతి టైం టేబుల్ ఇదే..
సబ్జెక్ట్ తేదీ
Also Read: