ICAR Jobs: రూ.31,000 జీతంతో ఐకార్‌లో వివిధ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!

న్యూఢిల్లీలోని ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-IARI) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ICAR Jobs: రూ.31,000 జీతంతో ఐకార్‌లో వివిధ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!
Icar Iari
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 01, 2022 | 6:30 AM

ICAR-IARI Recruitment 2022: న్యూఢిల్లీలోని ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-IARI) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 5

1. జూనియర్ రీసెర్ఛ్ ఫెలో: 1

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్/గేట్ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకి రూ.31,000లతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ అసోసియేట్: 1

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకి రూ.31,000లతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

3. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 3

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకి రూ.18,000లతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Inspiration Story: యాచించిన చోటే కేఫ్ నడుపుతోన్న ఓ అనాథ స్ఫూర్తిధాయక కథనం.. దేదీప్యమాన ’జ్యోతి‘ కథ!