ICAR Recruitment: ఐకార్-ఐఏఆర్‌ఐలో అసిస్టెంట్ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ICAR Recruitment: ఐకార్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా..
ICAR Recruitment: ఐకార్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 462 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటన్న పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 462 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఐకార్ హెడ్ క్వార్టర్స్ (71), ఐకార్ సంస్థలు (391) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.06.2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఐకార్ హెడ్ క్వార్టర్స్‌కు ఎంపికైన వారికి నెలకు రూ. 44,900, ఇతర ఐకార్ సంస్థల్లో పనిచేసే వారికి నెలకు రూ. 35,400 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 01-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..