
ICAI CA Foundation Exam 2022 postponed: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఫౌండేషన్ మే 2022 పరీక్షలు (CA May 2022 foundation examత) వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను తాజాగా ఐసీఏఐ విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది పరీక్షలు జూన్ 24, 26, 28, 30 తేదీల్లో నిర్వహించబడతాయి. కాగా గతంలో ఇచ్చిన తేదీల ప్రకారం ఫౌండేషన్ పరీక్షలు మే 23, 25, 27, 29 తేదీల్లో జరగాల్సి ఉండగా.. CBSE, CISCE బోర్డు పరీక్షల కారణంగా సీఏ పరీక్షలు వాయిదాపడ్డాయి. సీబీఎస్సీ ఎస్‌ఎస్సీఈ టర్మ్ II (2021-22) లేదా సీఐఎస్సీఈ సెమిస్టర్ 2 (2022) ఎగ్జామ్స్‌లలో వేటికైనా హాజరయ్యే విద్యార్థులకు ఆటంకం కలగకుండా ఈ మేరకు సీఏ ఫౌండేషన్ పరీక్షల రీ-షెడ్యూల్ మే 2022 చేసినట్లు తెలుస్తో్ంది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్icai.orgలో షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు.
సీఏ ఫౌండేషన్ పరీక్షల రీ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో కొత్త తేదీలు ప్రకటించబడ్డాయి. మరోవైపు ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఐసీఏఐ స్పష్టం చేసింది. గ్రూప్ I ఇంటర్మీడియట్ పరీక్షలు మే 15 నుంచి మే 22 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 24 నుంచి మే 30 వరకు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. ఇక సీఏ ఫైనల్ పరీక్షలు.. గ్రూప్ I పరీక్షలు మే 14 నుంచి 21 మధ్య నిర్వహించబడతాయి. గ్రూప్ బి పరీక్షలు మే 23 నుండి 29 వరకు జరగనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది.
Re-Scheduling of ICAI Foundation Exams-May 2022 in order to mitigate the hardships of those Students who are appearing in above Exams as well as in either of CBSE SSCE Term II(2021-22) or CISCE, Semester 2, 2022. New Dates-24th, 26th, 28th & 30th June 2022.https://t.co/yRVG2TsWpm pic.twitter.com/Lyi5FNyedH
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) March 15, 2022
Also Read: