IBPS RRB PO Result: ఐబీపీఎస్ ఆర్‌ర్‌ఆర్‌బీ పీఓ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను ఐబీపీఎస్ ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌ఆర్‌బీ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సుమారు 3800కిపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. పీఓ ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 40 ప్రశ్నలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి అడిగారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష తేదీకి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన చేయనున్నారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ అయిత ibps.inలో ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఆగస్టు 31, 2021 వరకు అందుబాటులో ఉంచనుంది.
* ముందుగా అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inను ఓపెన్ చేయాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉన్న ‘Click here to View Your Result Status of Online Preliminary Examination for CRP-RRBs -X-Officers Scale’లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* కొత్తగా ఓపెన్ అయిన పేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, పుట్టిన తేదీలాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
* అన్ని వివరాలు అందించి ‘లాగిన్’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభ్యర్థులు మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Gangula Kamalakar: ఏకంగా మంత్రినే టార్గెట్ చేసిన దుండగులు.. నకిలీ ఈడీ నోటీసులో బెదిరింపులు
Narayan Rane: 20 ఏళ్లలో తొలిసారి..కేంద్ర మంత్రిగా పని చేస్తూ అరెస్టయిన నారాయణ్ రాణే
Health Tips: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..