TS EAMCET Results 2021: విడుదలైన ఎంసెట్‌ ఫలితాలు.. పనిచేయని అధికారిక వెబ్‌సైట్‌.. ఒకేసారి ఎక్కువమంది.

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌ 2021 ఫలితాలను కాసేపటి క్రితమే విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో...

TS EAMCET Results 2021: విడుదలైన ఎంసెట్‌ ఫలితాలు.. పనిచేయని అధికారిక వెబ్‌సైట్‌.. ఒకేసారి ఎక్కువమంది.
Eamcet Results Page
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 25, 2021 | 11:46 AM

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌ 2021 ఫలితాలను కాసేపటి క్రితమే విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో మంగళవారం 11 గంటల సమయంలో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. అయితే పరీక్షా ఫలితాలు విడుదల చేయడంతోనే విద్యార్థులు ఒక్కసారిగా తెలంగాణ ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశారు. దీంతో భారీగా ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ పెరగడంతో తెలంగాణ ఎంసెట్‌ అధికారిక వెబ్‌ సైట్‌ పనిచేయడం లేదు. ప్రస్తుతం అధికారులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారు. మరికాసేపట్లోనే వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందని సమాచారం.

ఇక ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

Also Read: Salman khan: సల్మాన్‌ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..