IBPS PO Recruitment 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) PO పోస్టుల కోసం (probationary officer) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అప్లై చేసేందుకు చివరితేదీ దగ్గరపడుతోంది. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. IBPS జారీ చేసిన నోటీసు ప్రకారం.. ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 20 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. చివరితేదీ 10 నవంబర్ 2021గా నిర్ణయించారు. ఫీజుల సమర్పణకు కూడా చివరి తేదీ ఇదే రోజు. ప్రిలిమ్స్ పరీక్ష 4 డిసెంబర్ 2021 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. అదే మెయిన్స్ పరీక్షను జనవరి 2022లో నిర్వహించే అవకాశం ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి
1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇవ్వబడిన CRP ఎంపికకు వెళ్లండి.
3. ఇప్పుడు భాగస్వామ్య బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీల రిక్రూట్‌మెంట్ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) లింక్‌పై క్లిక్ చేయండి
4. ఇందులో కొత్త రిజిస్ట్రేషన్ కోసం న్యూ లింక్‌పై క్లిక్ చేయండి.
5. ఇందులో వివరాలు నింపి పేరు నమోదు చేసుకోండి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత కూడా దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.
కేటగిరీ వారీగా నియామకాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) జారీ చేసిన నోటీసు ప్రకారం..మొత్తం 4135 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1600 సీట్లు కేటాయించారు. ఇవే కాకుండా ఓబీసీ అభ్యర్థులకు 1102 సీట్లు, ఎస్సీ కేటగిరీకి 679 సీట్లు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 350 సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి 404 సీట్లు కేటాయించారు.
అర్హతలు & వయో పరిమితి
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థులు ఇతర అర్హతల గురించిన సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తుదారుడి వయస్సు 20 సంవత్సరాల కంటే ఎక్కువ 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. వయస్సు 1 అక్టోబర్ 2021 నాటికి లెక్కిస్తారు.