ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 8,594 గ్రూప్ ఎ- ఆఫీసర్ (క్లర్క్, పీఓ, ఆఫీసర్స్) స్కేల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జూన్ 21తో ముగియగా.. తాజాగా గడువు తేదీని జూన్ 28 వరకు పొడిగించినట్లు ఐబీపీఎస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా ఈ సందర్భంగా ఐబీపీఎస్ సూచించింది. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్‌లో జరుగనున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలు అక్టోబర్/నవంబర్ 2023లో ఉంటాయి. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ జనవరి 2024లో ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.