భారత త్రివిద దళాల్లో భాగమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. 108 అప్రెంటిప్ ట్రైనింగ్ (టెక్నికల్ ట్రేడుల్లో) ఖాళీల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతిలో 50 మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇంటర్మీడియట్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రకటనలో సూచించిన విధంగా శారీరక కొలతలు ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 14 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 5, 2023వ తేదీల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 23 -మార్చి 1, 2023 నెలల్లో ఉంటుంది. తుదా ఫలితాలు మార్చి 3న ప్రకటిస్తారు. ట్రైనింగ్ ఏప్రిల్ 3, 2023వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.8,855ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.