నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న హైదరాబాద్ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తో్న్నారు. ఇక కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో తరచూ జాబ్‌మేళాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (అక్టోబర్30)న పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి మరోసారి మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
27 కంపెనీలు…4వేల ఉద్యోగాలు..
ఫిక్కీ, సేఫ్ సిటీ, టిమి ఫౌండేషన్ ట్రస్ట్‌ల సహాకారంతో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో మొత్తం 27 కంపెనీలు పాల్గొననున్నాయి. టీఎంఐ గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, మహీంద్రా గ్రూప్, అపోలో ఫార్మసిస్ లిమిటెడ్, నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఎరెనా యానిమేషన్ వంటి ప్రముఖ సంస్థలు మొత్తం 4వేలకు పైగా ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. మలక్‌పేటలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం ఉదయం 9.30 గంటలకు ఈ జాబ్‌మేళా ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు లింక్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
#JobMela #MegaJobMela #HyderabadCityPolice pic.twitter.com/ZUXmfsvDAa
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 28, 2021
Also Read: