TS SSC Exams 2022: ఫూటుగా తాగి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌.. అక్కడికక్కడే టీచర్‌ సస్పెన్షన్!

|

May 25, 2022 | 1:20 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 (సోమవారం) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ పరీక్షకు.. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మందు కొట్టి ఇన్విజిలేషన్‌కు హాజరయ్యాడు. సర్‌ప్రైజ్‌ ఇన్‌స్పెక్షన్‌..

TS SSC Exams 2022: ఫూటుగా తాగి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌.. అక్కడికక్కడే టీచర్‌ సస్పెన్షన్!
Govt Teacher Suspended
Follow us on

Govt teacher suspended for attending SSC exam duty by consuming liquor: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 (సోమవారం) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ పరీక్షకు.. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మందు కొట్టి ఇన్విజిలేషన్‌కు హాజరయ్యాడు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన హుజూరాబాద్‌ మండలంలోని రాంపూర్‌ జిల్లా పరిషద్‌ హై స్కూల్‌లో ఎ రవికుమార్ అనే వ్యక్తి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిమిత్తం హుజూరాబాద్‌ జడ్‌పీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌ హై స్కూల్‌ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా మంగళవారం విధులకు హాజరయ్యాడు.

ఈ క్రమంలో ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావుకి రవికుమార్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. సదరు టీచర్‌ను ప్రశ్నించగా మద్యం వాసన గుబాలించడంతో.. వెంటనే స్థానిక పోలీసులను పిలిపించి సదరు టీచర్ కి ఎగ్జామ్‌ సెంటర్‌లోనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. మామూలుగా 30 ఉండాల్సిన మద్యం స్థాయిలు ఏకంగా 112 చూపించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా వెంటనే రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతనితోపాటు సదరు పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారిని కూడా విధుల నుంచి తొలగించారు. కాగా నిన్న జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు ఐదుగురు ఫ్లైయింగ్‌ సూపర్‌వైజర్లు రాష్ట్ర వ్యాప్తంగా 29 పరీక్షాకేంద్రాల్లో సర్‌ప్రైజ్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది.

పదోతరగతి పరీక్షల్లో మే 24న‌ జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 4,890 మంది గైర్హాజరయ్యారు. 5,08,143 మందికి గాను 5,03,253 మంది (99.04%) పరీక్ష రాశారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ నల్గొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.